Rana Daggupati: రెండు ఆపరేషన్లు చేయించుకున్నాను

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మకుటం లేని మహారాజులా ఏలుతుంటాయి. అందులో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. ఈ తరం కథానయకుల్లో సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న మొదటి హీరో రానా. ఇటీవల రానా తన బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ తో నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు అనే క్రైమ్, యాక్షన్ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఉందని, ఫ్యామిలీ హీరోస్ ఇలాంటి సిరీస్ లో ఎలా నటించారు అనే వ్యతిరేకత వస్తున్నా.. సిరీస్ లో ఉన్న స్టోరీకి మాత్రం పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని సంపాదిస్తుంది. ఇదిలా ఉండగా, రానా నాయుడు సిరీస్ ప్రమోషన్ లలో భాగంగా రానా తన ఆరోగ్యం గురించి ఆశ్చకర్యమైన నిజాలను వెల్లడించారు.

తనకు చిన్నప్పటి నుంచే కుడి కన్ను కనిపించదని, దానికి తనకు ఒక ఆపరేషన్ అయిందని చెప్పాడు. అలాగే ఇటీవల తనకు కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ కూడా అయిందని చెప్పుకొచ్చాడు. చాలా రోజుల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడినట్టు తెలిపారు. తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండె సంబంధిత సమస్య వచ్చిందని, దీంతో కిడ్నీ పాడైందని వివరించారు. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని డైరెక్టర్లు చెప్పారని, అందుకే విదేశాల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

తన ఆరోగ్య సమస్యలన్నీ తొలిగిపోయిన తర్వాతే మిహికా బజజ్ ను వివాహం చేసుకున్నట్టు రానా తెలిపాడు. అలాగే తాను ఆనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నానని, ఎప్పుడు క్రుంగిపోలేదని తెలిపాడు. అదే తనను కాపాడిందని చెప్పుకొచ్చాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు