Ram Charan: #RC15 నుంచి మళ్లీ లీక్స్

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC15. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. దీన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ భారీ స్థాయి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిలో హీరోయిన్ గా బాలీవుడ్ లో బ్యూటీ, కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నుంచి లీక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కి సంబంధించిన లుక్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఒక బహిరంగ సభలో శ్రీకాంత్ తో రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. వీటితో పాటు చాలా ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా మరి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ లోని చార్మీనార్ వద్ద RC15 షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక బహిరంగ సభ సెట్ ను డైరెక్టర్ శంకర్ వేశాడు. అక్కడ రామ్ చరణ్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లీక్స్ కాకుండా చిత్ర యూనిట్ పకడ్బందీగా చర్యలు తీసుకున్నా.. లీక్స్ ఆగడం లేదు. కాగా డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు కమల్ హాసన్ తో ఇండియన్ 2 షూటింగ్ లో ఉన్నాడు. ఇటీవల ఆర్సీ 15 షూటింగ్ ను స్టార్ట్ చేశాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు