Rakul Preet Singh : ముహూర్తం వచ్చే ఏడాదే

తెలుగులో అతి వేగంగా స్టార్ హీరోయిన్ ట్యాగ్ అందుకున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలతో స్టార్ హీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్ లో ఒక మెరుపు మెరిసింది. కొంత కాలానికి రకుల్ కు క్రమంగా సినిమా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. బాలీవూడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో తెలుగులో సినిమాలు తగ్గాయి. అక్కడ కూడ రకుల్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో .. ఈ భామ హిట్ చూసి చాలా కాలం అయింది.

అయితే ఈ బ్యూటీ.. జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ విషయం గురించి గతేడాది అధికారికంగా ప్రకటించింది. సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నా, ఖాళీ దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ఒకరితో ఒకరు సమయం గడుపుతూ, ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా తమ బంధం ఎంత బలంగా ఉందో చూపిస్తునారు. క్రిస్మస్ సందర్బంగా “దేవుడు ఇచ్చిన శాంటా నువ్వు ” అంటూ తన కాబోయి భర్త జాకీ భగ్నానీ గురంచి చెప్పుకొచ్చింది ఈ అందాల భామ.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రకుల్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు వీళ్లు పెళ్లీ పీటలెక్కబోతున్నారంటూ టాక్ వచ్చింది. కానీ అవన్నీ రూమర్స్ అంటూ ఈ ప్రేమ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా వీరి పెళ్లిపై మరో సారి వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట తప్పకుండా ఒక్కటవుతుందని, అందుకు రకుల్-భగ్నానీ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మాట పై రకుల్ స్పందించక పోయినా పెళ్లి వార్త చెప్పడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు