Rajinikanth: ఫ్యాన్ మూమెంట్

సాధార‌ణంగా జీవితంలో ఒక్క‌సారి అయినా త‌మ అభిమాన న‌టుడిని క‌ల‌వాల‌నో లేక త‌మ అభిమాన న‌టుడితో క‌లిసి ఒక‌సారి అయినా ఫోటో దిగాల‌నో ఇలా అనుకుంటుంటారు. ఇక అలాంటి అవ‌కాశం వ‌స్తే మాత్రం అస్స‌లు వ‌దులుకోరు. ఇదే మాదిరిగా ఓ చిన్నారి సూప‌ర్ స్టార్ ర‌జినికాంత్‌తో ఫోటోలు దిగింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ర‌జినినీ చూడ‌గానే ఆ చిన్నారి సంతోషానికి అవ‌ధులు లేవనే చెప్ప‌వ‌చ్చు.

ర‌జినికాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ జైల‌ర్‌. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇందులో భాగంగానే ర‌జినీకాంత్ ని క‌లిసేందుకు ఓ చిన్నారి రాగా.. ఆమెను ఆప్యాయంగా ప‌లుక‌రించి ద‌గ్గ‌ర‌కి తీసుకొని ఫోటోలు దిగారు. ఆ త‌రువాత ఆ చిన్నారి సూప‌ర్ స్టార్ వ‌ద్ద నుంచి ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ని క‌లిసిన సంద‌ర్భంలో ఆమె క‌ళ్ల‌లో ఆనందం ఉట్టిప‌డుతుంది. ప్ర‌స్తుతం ర‌జినీ ఆ చిన్నారితో క‌లిసి దిగిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ర‌జినీకాంత్ మ‌రోసారి త‌న సింప్లిసిటీని ప్ర‌ద‌ర్శించారు అని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. జైల‌ర్‌గా జైళ్ల‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చే జైలు అధికారి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మా దైవం సినిమా త‌ర‌హాలో ఈ సినిమాని తెర‌కెక్కిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే విడుద‌ల ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ర‌క్తంతో త‌డిసిన స‌గం క‌త్తిని వేలాడ‌దీయ‌డం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శివ‌రాజ్‌కుమార్, వసంత్‌ర‌వి, ర‌మ్య‌కృష్ణ‌, యోగిబాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అనిరుధ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు