Purna: తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్

మలయాళన నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమె అసలు పేరు షమ్నా కాశీమ్. మొదట శ్రీమహాలక్ష్మి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత అవును, సీమటపాకాయ్, రాజు గారి గది, అఖండ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది పూర్ణ. మంచి ఫిజిక్ గ్లామర్ యాక్టింగ్ తో చిత్రసీమలో తన మార్క్ చూపించిన పూర్ణ అడపాదడపా సినిమాలు చేస్తూనే బుల్లితెర షోస్ పై మెరుస్తూ కెరీర్ లో ముందుకెళ్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం దుబాయ్ బిజినెస్మెన్ షానిద్ అసిఫ్ అలీ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

దుబాయిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో అరబిక్ పద్ధతిలో ఈమె వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉంటే.. పూర్ణ తల్లిని కాబోతున్నాను అని ప్రకటించింది. తన పేరెంట్స్, బంధువులతో తాను తల్లిని కాబోతున్న విషయాన్ని పంచుకొని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న సన్నివేశాన్ని వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. పూర్ణ తల్లి కాబోతుంది అని ప్రకటించడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను పూర్ణ షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు