Prabhas : ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ రీ-రిలీజ్

నిన్న రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఎంత నిరాశపరిచిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా ఇచ్చిన షాక్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్న సమయంలో ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ మరో పెద్ద షాక్ ను ఇచ్చిందనే చెప్పాలి.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రం, భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్ వేదికపైన ఈరోజు ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా నిన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో అంచనాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేయగా, నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ముందు నుంచి ఫస్ట్ లుక్ ఇదిగో, అదిగో అంటూ ఫ్యాన్స్ ను తెగ ఊరించి, చివరకు ఫ్యాన్ మెడ్ ఎడిట్ ను తలపించేలా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు.

ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని గమనించిన మూవీ టీం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మళ్ళీ రీ- ఎడిట్ చేసి కాసేపటి క్రితం రిలీజ్ చేసారు.అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్, నిన్న రిలీజ్ పోస్టర్ రెండు ఒకటే అయినప్పటికీ, కెమెరా యాంగిల్ లో వ్యత్యాసం ఉండటంతో నిన్న వచ్చిన నెగిటివ్ కామెంట్స్.. ఈరోజు పోస్టర్ కు పాజిటివ్ గా మారాయి.

- Advertisement -

ప్రస్తుతం రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. ఇదేదో నిన్ననే రిలీజ్ చేసి ఉండాల్సికదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకునే నటిస్తుండగా, దిశాపటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి ప్రాతలో నటిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్-కె రిలీజ్ అవబోతుంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు