Pori Superoo : నితిన్ ” పోరి సూపర్”

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మాచర్ల నియోజకవర్గం”. గతేడాది “మాస్ట్రో” ‘”చెక్”, “రంగ్ దే” సినిమాలు నిరాశపరచడంతో.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ తో పొలిటికల్ డ్రామా మూవీని ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో హీరోయిన్ గా కేథరిన్ నటిస్తోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు, టీజర్, ట్రైలర్ కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్ డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ” రా రా రెడ్డి”, “అదిరిందే” పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మరో పాటని రిలీజ్ చేశారు. ” పోరి సూపరో ” అంటూ సాగే మాస్ బీట్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. మహతి స్వర సాగర్ సంగీతమందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు.

ఈ పాటలో బేబమ్మ నడుము అందాలతో కనువిందు చేసింది. నితిన్, కృతి శెట్టి కలిసి వేసిన సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 12 వరకు ఆగాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు