Pooja Hegde : కోలీవుడ్ పై ఫోకస్

పూాజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉంది. ఇటీవల పూజా నటించిన సినిమాలు ప్లాఫ్ అయినా, ఐరెన్ లెగ్ అనే ముద్ర పడినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో బాలీవుడ్ పై కూడా కన్నేస్తోంది. బాలీవుడ్ లో ఈ భామ ప్రస్తుతం “సర్కస్” “కబీ ఈద్ కబీ దివాలీ” అనే సినిమాల్లో నటిస్తుంది. ఇదే సమయంలో కోలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తోంది పూజా.

ఎక్కడ నష్టపోయామో, తిరిగి అక్కడే సంపాదించుకోవాలని అంటారు పెద్దలు. ఈ సామెతను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫాలో అవుతున్నట్టు ఉంది. పూాజా కెరీర్ కోలీవుడ్ తోనే ప్రారంభమైంది. 2012లో “ముగమూడి” అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ తో “బీస్ట్” అనే సినిమాలో నటించింది. గుర్తింపు కాదు కద, కెరీర్ లోనే పెద్ద మైనస్ గా ఈ సినిమా నిలిచింది. ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ మరోసారి తెరపైకి వచ్చేలా చేసింది.

అయినా, కోలీవుడ్ పై ఈ బుట్టబొమ్మ ఫోకస్ చేయడం తగ్గించలేదు. కోలీవుడ్ లో పూజా తాజా గా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత చిరుతై శివతో మరో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఈ బుట్టబొమ్మను సంప్రదించారట. కోలీవుడ్ లో ఎదగాలని టార్గెట్ పెట్టుకున్న పూజా, ఈ ప్రాజెక్ట్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినిపిస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

కాగా, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోల్లో సూర్య ఒకడు. సూర్య హీరోగా ఇటీవల వచ్చిన “జై భీమ్” “ఆకాశం నీ హద్దురా” సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి హీరో సరసన పూజా నటిస్తే, కోలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు