Om Bheem Bush : భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఓం భీమ్ బుష్..!!

Om Bheem Bush : టాలీవుడ్ లో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు హీరో శ్రీ విష్ణు.. ఇప్పుడు తాజాగా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఓం భీమ్ బుష్..(Om Bheem Bush) ఈ సినిమా కలెక్షన్స్ తో సునామీని సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ .17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి మరొకసారి థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

కలెక్షన్స్ అదుర్స్..

వీరి ముగ్గురు కాంబినేషన్లో ఇది రెండవ సినిమా కాగా..శ్రీ విష్ణు తన చివరి చిత్రం సామజవరగమన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. అదే విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకి భారీగానే జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఓం భీమ్ బుష్ సినిమా ఓపెనింగ్ అయిన రెండు రోజులలోనే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక మూడవరోజు కలెక్షన్స్ మరింత అదరగొట్టినట్టుగా తెలుస్తోంది.

మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్..

కేవలం మూడవరోజు మాత్రమే రూ.6.56 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇలా ఈ చిత్రం మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శ్రీ విష్ణు సినీ కెరియర్ లో వారంతంలోనే అధిక కలెక్షన్స్ సాధించిన వారంతపు చిత్రంగా ఈ సినిమా మిగిలింది. యూఎస్ఏ లో కూడా ఓం భీమ్ బుష్ సూపర్ హిట్ గా మంచి సాలిడ్ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా అక్కడ రీజియన్ లో మూడు రోజులలోనే $315K వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు దేశమంతా హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు.. పైగా ప్రభుత్వ సెలవు కూడా.. ఈ సందర్భంగా హాలిడే ఉండడంతో సినిమా కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

శ్రీ విష్ణు కెరియర్ ని నిలబెట్టిన ఓం భీమ్ బుష్..

ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి డైరెక్టర్ వహించారు.. వి సెల్యులాయిడ్ ,సునీల్ బొలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ సెలవులలో లాంగ్ వీకెండ్ లో ఎంతటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.. మరి అలాగే శ్రీ విష్ణు కెరియర్ లోనే అతిపెద్ద రికార్డుగా ఈ సినిమా నిలబడుతుందని అభిమానులను నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. ఇక శ్రీ విష్ణు కెరియర్ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులలో విభిన్నమైన పాత్రలను పెంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు