టాలీవుడ్ లో సొంతంగా పైకి వచ్చిన హీరోలలో నిఖిల్ సిద్ధార్ద్ ఒకరు. హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా పరిచయమైన నిఖిల్.. ఇటీవల చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 చిత్రం ద్వారా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు నిఖిల్ సిద్ధార్ద్. కెరీర్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు నిఖిల్.
కార్తికేయ సినిమా సక్సెస్ నుంచి ఇంకా బయటకు రాకుండానే నిఖిల్ నటించిన 18 పేజీస్ సినిమా విడుదల అయింది. సుకుమార్ కథ అందించిన ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ వరుస విజయాలను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్.
Read More: Krithi shetty Personal Life : కృతి శెట్టి డేటింగ్ పిక్ లీక్
ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతుండగా.. ఒక నెటిజన్ నుంచి నిఖిల్ కి కార్తికేయ 3 సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం చెబుతూ.. “కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి 3డి లో మరో అద్భుతమైన పాయింట్ ని డైరెక్టర్ చందు మొండేటి వినిపించారు” అని కార్తికేయ 3 సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Read More: “భయపడ్డాం”… లావణ్యతో రిలేషన్‌షిప్‌పై వరుణ్ తేజ్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...