Niharika: డైవర్స్ దిశగా మెగా ఫ్యామిలీ గారాల పట్టి నిహారిక?

మెగా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలో నిహారిక ఒకరు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. ఢీ జూనియర్స్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక, మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోయిన్ గా కూడా చేసింది. తర్వాత నిర్మాత అవతారం ఎత్తి కొన్ని సినిమాలను కూడా నిర్మించింది. అయితే 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే యువకుడితో ఈమె వివాహం జరిగింది. మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపారు.

పెళ్లి అయిన తొలినాళ్లలో నిహారిక కాపురం సజావుగానే సాగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత నిహారిక, చైతన్య మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం జరిగింది. నిహారిక.. తన అత్తారింటి నుంచి వచ్చి నాగబాబు దగ్గరే ఉంటుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత నిహారిక, చైతన్య కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బ్రేకులు పడ్డాయి. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకుల గురించి ఈ సారి చాలా బలంగా వార్తలు వస్తున్నాయి.

నిహారిక భర్త చైతన్య జోన్నలగడ్డ తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు నిహారిక ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేశాడు. అలాగే నిహారికను అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం చైతన్య.. మెగా ఫ్యామిలీ అందరిని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాడు ఒక నిహారికను మినహా. నిహారిక కూడా చైతన్య ఇన్ స్టా ప్రొఫైల్ ను అన్ ఫాలో చేసింది. దీంతో ఈ సారి వీరు డైవర్స్ తీసుకోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అయితే దీనిపై నిహారిక గానీ, చైతన్య గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. నిజంగానే నిహారిక, చైతన్య విడాకులు తీసుకోవాల్సి వస్తే.. మెగా ఫ్యామిలీ ఎలాంటి స్టేప్ తీసుకుంటుంది అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతుంది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలుపుతారా ? లేదా మెగా ఫ్యామిలీ ఈ గారాల పట్టికి డైవర్స్ ఇప్పిస్తారా ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు