Nayanthara : మ‌ళ్లీ క‌ష్టాలు

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు ఈ ఏడాది జూన్ 09 పెళ్లి చేసుకున్న విష‌యం విధిత‌మే. వీరు పెళ్లి చేసుకొని స‌రిగ్గా నాలుగు నెల‌లు పూర్త‌యిన రోజునే వీరికి క‌వ‌ల పిల్ల‌లు పుట్టారు. ఈ విష‌యాన్ని న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ స్వ‌యంగా ట్వీట్ చేశారు. అయితే వీరు పెళ్లి చేసుకున్న నాలుగు నెల‌ల‌కే పిల్ల‌లు ఏంటి అని అంద‌రూ ఆశ్చ‌ర్యపోతున్నారు.

మ‌రోవైపు పెళ్లి త‌రువాత కొద్ది రోజుల వర‌కు ఈ దంప‌తులు ఒక్క ఫోటోను కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌లేదు. అయితే వీరి పెళ్లి ఆల్బ‌మ్ నెట్‌ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో డీల్ ర‌ద్దు చేసుకున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి. కానీ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్ ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఆల్బ‌మ్ విడుద‌ల త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

వాస్త‌వానికి న‌య‌న‌తార-విఘ్నేష్ దంప‌తులు స‌రోగ‌సి ద్వారా క‌వ‌ల‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం గురించి కొంత మంది పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే.. మ‌రికొంద‌రూ నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం న‌య‌న్‌-విఘ్నేష్ దంప‌తుల‌కు షాక్ ఇచ్చింది. ఈ దంపతులు క‌వ‌ల‌ల‌కు పేరెంట్స్ అయిన‌ట్టు ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల్లోనే వివాదం కొన‌సాగుతోంది. వాస్త‌వానికి స‌రోగ‌సిని భార‌త‌దేశంలో బ్యాన్ చేశారు. 2022 నుంచి ఈ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి గ‌ర్భం దాల్చ‌లేని సంద‌ర్భంలోనే స‌రోగ‌సికి దేశంలో అనుమ‌తి ఉంది. దీంతో న‌య‌న్‌-విఘ్నేష్ జంట స‌రోగ‌సి ద్వారా త‌ల్లిదండ్రులు అయిన‌ట్టు వస్తున్న వార్త‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని తాజాగా త‌మిళ‌నాడు ప్రభుత్వం స్పందించింది. పిల్ల‌లు ఎలా పుట్టారో వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఈ దంప‌తుల‌ను ఆదేశించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు