Narappa: ఓటిటి నుంచి థియేటర్ కి

కొన్ని థియేటర్ లో మిస్ అయినా సినిమాల కోసం ఓటిటిని నమ్ముకోవడం సహజమే.కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు ఓటిటి బాట పట్టాయి. కొన్ని సినిమాలు ఓటిటి లో విడుదల అవ్వడం వలన సూర్య, ఫహద్ ఫాజిల్ , వెంకటేష్ , నాని లాంటి నటులు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
సూర్య నటించిన జై భీం, ఆకాశమే నీ హద్దురా సినిమాలు అలానే వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం -2 లాంటి సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ మంచి ప్రశంసలు అందుకున్నాయి.

ఇంత మంచి సినిమాలను థియేటర్స్ లో మిస్ అయినందుకు చాలామంది అభిమానులు నిరాశకు గురి అయ్యారు. అటువంటి అభిమానులకు ఇప్పుడు శుభవార్త ఏంటంటే నారప్ప సినిమా మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది అది కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే.విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ (Narappa) సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా ‘నారప్ప’ తెరకెక్కింది.

వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన తరవాత ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు