నేచురల్ స్టార్ హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ హిట్ అయిన తరువాత వచ్చిన అంటే సుందరానికి మూవీ ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు నాని. అలా ఆయన చేసిన సినిమానే ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్ లో ఆమెకి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ ఉండనుంది.
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా పేరు ‘దసరా’ కావడంతో, ‘దసరా’ పండుగకి ఏదైనా అప్ డేట్ వదులుతారా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా దసరా సినిమాలోని ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇందులో భాగంగానే నాని కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఫుల్ మాస్ అవతారంలో నాని కనిపిస్తున్నాడు. లుంగీ ధరించి, దుమ్ముతో నిండిపోయి అతడు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటలో నాని డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.