Nandita Swetha: ఈ హీరోయిన్ అంత లావు అవ్వడానికి కారణం ఇదే..!

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ్ భాషలలో నటించింది. హీరోయిన్ గా పలు సినిమాలలో మెప్పించిన నందిత మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథ చిత్రం 2, కపటధారి, అక్షర వంటి చిత్రాలలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆ మధ్య బుల్లితెరపై కూడా ఎంట్రీ చేసింది. డీ14 డాన్స్ షోలో నందిత జడ్జిగా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం నందితా శ్వేత త్వరలో హిడింబా అనే సినిమాతో ప్రేక్షకులం ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిత.. ఆ మధ్య ఈమె అంతలా లావు అవ్వడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చింది.

తనకి ఉన్న ఓ అనారోగ్య సమస్య కారణంగానే ఆమె అంతలా లావు అయిందట. ఫైబ్రోమయాల్జియా అనే కండర రుగ్మతతో బాధపడుతుందట నందిత. దీనివల్ల ఎక్కువగా డైట్ పాటిస్తూ భారీ వ్యాయామాలు చేయడం కూడా సాధ్యం కాదట. మితిమీరిన ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి కారణాలవల్ల ఇది ఇంకా తీవ్రతరం అవుతుందని.. ఆ కారణంగా ఇంకా బరువు పెరిగి పోతామంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ తరువాత మళ్లీ ఒళ్ళు తగ్గించడం సులభమైన పని కాదట. అలా అని వదిలేస్తే ఇంకా లావు అయిపోతామని చెప్పింది. ఇది వెన్నుముక, కండరాలకు సంబంధించిన సమస్యగా తెలిపింది నందిత. ఒక్కసారిగా నీరసం వచ్చేయడం, ఆ నొప్పిని బ్రెయిన్ గ్రహించలేకపోవడం లాంటివి ఈ రుగ్మత లక్షణాలని.. క్రమం తప్పకుండా డైట్, వ్యాయామాలు చేస్తేనే మన ఆధీనంలో ఉంటుందని తెలిపింది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు