Pawan kalyan: బ్రో ను భయపెడుతున్న ఆ సినిమా..?

సాధారణంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు తీయడమే పెద్ద తలనొప్పి. ఎందుకంటే టాలీవుడ్ హీరోలకున్న ఇమేజ్ సమస్య వల్ల మా హీరోను తక్కువ చేసి చూపించారు, ఆ హీరోను ఎక్కువ సేపు చుపించారంటూ ఫ్యాన్స్ లో తగాదాలు వస్తాయి. వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇటువంటి విమర్శలు రాకా తప్పలేదు. అందుకే తెలుగు దర్శకులెవరు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబర్చారు. దీనికి తోడు తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు(ఆర్ఆర్ఆర్ సినిమా మినహా) పెద్దగా ఆడింది కూడా లేదు.

ఇక ప్రస్తుతం తెలుగులో వస్తోన్న లేటెస్ట్ మల్టీ స్టారర్ సినిమా బ్రో. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా పది రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో ప్రేక్షకుల బాగా ఆకట్టుకోగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే బ్రో సినిమాకు సంబంధించి ఇటీవలనే రిలీజవుతున్న పాటలు ఈ సినిమాపై కాస్త నెగిటివ్ గా మారగా, గతంలో వచ్చిన ఒక సినిమా మల్టీ స్టారర్ సినిమా సెంటిమెంట్, ఏకంగా బ్రో సినిమాను భయపెడుతుంది.

గతంలో కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామా సినిమా గురించి అందరికి తెలిసిందే. ఆఫ్ స్క్రీన్ మామా అల్లుళ్లయినా నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజై, ప్రేక్షకులను అలరించలేకపోయింది . అయితే ప్రస్తుతం వస్తోన్న బ్రో సినిమాలో కూడా ఆఫ్ స్క్రీన్ మామా అల్లుళ్లయినా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయిక లో ఈ సినిమా వస్తుండటంతో వెంకీ మామా సినిమాలాగానే బ్రో సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తుందేననే భయం పీకె ఫ్యాన్స్ లో మొదలైంది. దానికి తోడు థమన్ అందించిన మ్యూజిక్ చాలా వరకు డిసప్పాయింట్ గా ఉండడంతో ఈ భయం ఇంకా ఎక్కువవుతుంది. మరీ ఫ్యాన్స్ భయాలకు చెక్ పెట్టెల వెంకీ మామా సెంటిమెంట్ ను బ్రో సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలంటే ఇంకో పది రోజులు ఆగాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు