Murali Mohan: ఆ చిన్న తప్పు.. ఆస్తులన్నీ కరగబెట్టిందా…?

Murali Mohan: ప్రముఖ నటులు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగులో నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా , రియల్ ఎస్టేట్లో కింగ్ గా కూడా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు ఇప్పటికీ తనదైన శైలితో గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ హీరోగా వచ్చి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మధ్యలో నిర్మాతగా దాదాపు 25 సినిమాలకు పనిచేశారు. 80 ఏళ్ల ప్రాయంలో కూడా ఇప్పటికీ సినిమాలంటే ప్రాణం అంటారు ఈయన.. అలాంటి నటులు, నిర్మాత ఉన్నట్టుండి సినిమాలు తీయడం మానేశారు. పైగా ఆస్తులన్నీ కరగబెట్టుకున్నారు.. నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా ఉన్నట్టుండి సినిమాలు తీయడం మానేశారు..

అప్పటివరకు రెగ్యులర్ సినిమాలు నిర్మించిన మురళీమోహన్ అలా సినిమాలు మానేయడానికి గల కారణం చాలామందికి తెలియక ఎన్నో అభిప్రాయాలను వ్యక్తం చేశారు.. మురళీమోహన్ చేసిన ఆ తప్పేంటి? ఆస్తులు కరిగిపోవడానికి గల కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా దాదాపు 18 సంవత్సరాలవుతుంది. మరొకవైపు మురళీమోహన్ నిర్మించిన జయభేరి సినిమాపై మరో సినిమా రాలేదు.

అతడు సినిమా క్లాసిక్ గా నిలిచిపోయింది కానీ నిర్మాతగా మురళీమోహన్ కి మాత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది. టీవీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా కిఅప్పట్లో థియేటర్ కలెక్షన్స్ పరంగా ఊహించినంత కలెక్షన్లు మాత్రం రాలేదు. అయితే దానికంటే ముందు మురళీమోహన్ చాలా సినిమాలు నిర్మించారు. కొన్ని విజయాలు ఉన్నాయి.. మరికొన్ని ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. కానీ సినిమాలు తీయడం ఎందుకు మానేశారు అంటే.. ఇప్పుడున్న పరిస్థితులు ఆయనకు నచ్చట్లేదని చెప్పారు.

- Advertisement -

సాధారణంగా ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం నిర్మాత నెత్తిమీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళ చుట్టూ తిరగాలి..కష్టపడి డేట్స్ తెచ్చుకోవాలి.. ఈ తిప్పలు ఉండకూడదు అని ముందు నుంచి కూడా చిన్న సినిమాలు తీద్దామని ఫిక్స్ అయ్యారట మురళీ మోహన్.. అలాంటి సినిమాలే ప్లాన్ చేశారట.. కానీ ఎందుకో సినిమాలు తీయలేదు..ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే అప్పటివరకు సంపాదించిన ఆస్తులు మొత్తం పోతాయి..ఇక మురళీమోహన్ కెరియర్ లో కూడా ఇదే జరిగింది.. ఒక సినిమాతోనే అప్పటివరకు సంపాదించిన ఆస్తులన్నీ పోయాయని ఆయన తెలిపారు.

తమ నిర్మాణ సంస్థలో దాసరి, రాఘవేంద్రరావు, మధుసూదన్ రావు , విశ్వనాథ్, కోడి రామకృష్ణ వంటి దర్శకులతో కూడా లో బడ్జెట్ సినిమాలు చేసిన ఈయన మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు అనే సినిమాతో తన కెరీర్ తలకిందులు అయిపోయిందని తెలిపారు. కరుణానిధి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మణిరత్నం ఈ సినిమాను మొదలుపెట్టారు. జయలలిత అధికారంలో ఉండడంతో ఉన్నది ఉన్నట్లే సినిమా తీశారు .

అయితే సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నప్పుడు కరుణానిధి అధికారంలోకి వచ్చి.. సినిమాలో తనకు నచ్చని సన్నివేశాలని తీయించేశారు. ఇక ఈ సినిమాలో కంటిన్యూటీ లేకపోవడం వల్ల సినిమా మొత్తం డిజాస్టర్ గా మిగిలింది. దాంతో అప్పటివరకు దాచుకున్న ఆస్తులన్నీ కరిగిపోయాయి అంటూ గుర్తు చేసుకున్నారు మురళీమోహన్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు