2023 Tollywood Recap : ఈ ఏడాది టాలీవుడ్ కింగ్ బాలయ్యే, తగ్గేదే లే అంటున్న నాని

2023 Tollywood Recap : 2023లో టాలీవుడ్ కింగ్ గా బాలయ్య నిలిచారు. ఈ ఏడాది ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఏకంగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని బాక్సాఫీస్ వద్ద ఈ సింహం గర్జించిన తీరుకు బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. 2021లో నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” సినిమాతో బాలయ్య జైత్రయాత్ర మొదలైంది. నిజానికి “లెజెండ్”, “అఖండ” వంటి బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన సినిమాలు మాత్రమే భారీ హిట్స్ అవుతూ ఉండడంతో, బాలయ్య ఎక్కువగా హిట్ కొట్టడం కోసం బోయపాటిపై ఆధారపడుతున్నాడని టాక్ నడిచింది.

కానీ ఈ ఏడాది డిఫరెంట్ సినిమాలతో ఆ టాక్ కు ఫుల్ స్టాప్ పెట్టారు బాలయ్య. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బాలయ్యలో మంచి జోష్ నింపాయి.

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన “వీరసింహా రెడ్డి” సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించి నైజాం లాంటి సెంటర్లలో, ఓవర్సీస్ లో చిరంజీవి “వాల్తేరు వీరయ్య”ను వెనక్కి నెట్టేసింది. ఇక “భగవంత్ కేసరి” సినిమాతో బాలయ్య తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరోసారి హిట్ కొట్టాడు. ఇలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఈ ఏడాది టాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు బాలకృష్ణ. అదే జోష్ తో తన నెక్స్ట్ మూవీపై కాన్సన్ట్రేట్ చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య నెక్స్ట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. మొత్తానికి 2023లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు బాలయ్య.

- Advertisement -

ఇక టైర్ టు హీరోల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నానిదే ఈ ఏడాది పైచేయి. “దసరా” వంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ తో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టాడు. ఈ సినిమాతో నాని ఖాతాలో ఫస్ట్ 100 కోట్ల మూవీ పడింది. ఇక తాజాగా విడుదలైన “హాయ్ నాన్న” మూవీతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు నాని. తను ఎంచుకునే స్ట్రాంగ్ కంటెంట్ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. నిజానికి “యానిమల్” మూవీ మేనియా ఉన్న సమయంలో “హాయ్ నాన్న” మూవీ రిలీజ్ కావడంతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగులుతుందని అందరూ భావించారు. కానీ నాని నమ్మకమే గెలిచింది. ఇలా టైర్ 1 హీరోలలో బాలయ్య, టైర్ 2 హీరోలలో నానికి 2023 చిరస్మరణీయంగా మిగిలింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు