Jai Bhim : సీక్వెల్ పై క్లారిటీ

కరోనా మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ సమయంలో అన్ని సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఓటీటీల్లో వచ్చినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అలా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీల్లో జై భీమ్ ఒకటి. గత ఏడాది నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం విడుదలైంది. సమాజంలో జరుగుతున్న వాటిని సినిమాలుగా తెరకెక్కించే టి.జె. జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇందులో జస్టిస్ చంద్రు పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒదిగిపోయాడు. ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ఈ సినిమా చూసిన తర్వాత దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అది అలా మూవీ యూనిట్ వరకు కూడా వెళ్లింది. కానీ అక్కడి నుంచి స్పష్టమైన స్పందన రాలేదు.

తాజాగా జై భీమ్ సీక్వెల్ పై దర్శకుడు టి.జె. జ్ఞానవేల్, సహా నిర్మాత రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కు వీరు హాజరయ్యారు. అక్కడ మూవీ మీడియా ప్రతినిధుల నుంచి జై భీమ్ సీక్వెల్ పై ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా.. ”ప్రముఖ న్యాయవది చంద్రు కెరీర్ లో చాలా ముఖ్యమైన కేసులను వాదించాడు. అందులో ఒక కేసుతో జై భీమ్ ను తెరకెక్కించాం. ఆయన వాదించిన మరిన్నీ కేసులతో జై భీమ్ కు సీక్వెల్ ను రూపొందించవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో త్వరలోనే జై భీమ్ కు సీక్వెల్ ఉంటుందని స్పష్టం గా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు