#MegastarKalyanRam: కారణం ఏంటి?

టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ అనేవి కొత్తవి కావు. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఫ్యాన్ వార్స్ లో కూడా ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. తమ హీరో సినిమాలను వేరే హీరో సినిమాలతో కంపేర్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతే ఆ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు థియేటర్ వద్ద అతి పెద్ద బ్యానర్స్ కడుతూ తమ అభిమానాన్ని తెలిపేవారు. కానీ ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్ తో తమ అభిమానాన్ని చాటుతున్నారు. యూట్యూబ్ వ్యూస్ , బాక్స్ ఆఫీస్ కలక్షన్స్ ఇప్పుడు ఫ్యాన్ వార్స్ కి కీలకం.

ఇక అసలు విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ బింబిసారా శుక్రవారం నాడు విడుదలై హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది.ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 90% ఆక్యుపెన్సీ. నందమూరి కుటుంబం మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు NBK అఖండ, ఆ తర్వాత ఎన్టీఆర్ RRR, మరియు ఇప్పుడు కళ్యాణ్ రామ్ యొక్క బింబిసార. బింబిసార భారీ ఓపెనింగ్స్ తో నందమూరి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సాధించలేనిది కళ్యాణ్ రామ్ ఒంటరిగా సాధించాడని కొందరు అంటున్నారు. అనేక థియేటర్లలో బింబిసార ఆచార్య కంటే మెరుగైన ఆక్యుపెన్సీలను నివేదించినట్లు ట్రేడ్ రిపోర్ట్‌లు సూచిస్తున్నాయి. దీనితో మెగా ఫ్యామిలీ వ్యతిరేక అభిమానులు #MegastarKalyanRam ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.కెరీర్ మొత్తం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ని చిరంజీవి ఫ్లాప్ మూవీతో పోల్చుకోవడంతో వాళ్ళ స్థాయి ఏంటో తెలుస్తుంది అని మెగా అభిమానుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు