Allu Studios: “అల్లు స్టూడియోస్” లాంచ్ కి మెగాస్టార్ !

అల్లు కుటుంబం వారు హైదరాబాద్ లో ఒక సినీ స్టూడియో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్ 1న దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన వారసుడు అల్లు అరవింద్ నేతృత్వంలోని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ (నయా ట్రెండి స్టూడియో) ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ శివారులలోని ఔటర్ రింగ్ రోడ్ గండిపేట దగ్గరలో ఒక స్టూడియో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఆ స్టూడియో నిర్మాణం పూర్తి చేసుకుంది. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఈ స్టూడియోని ప్రారంభించనున్నారు. ఈ స్టూడియోస్ భారీ ఆరంభానికి అల్లు వారి అల్లుడు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా తన చేతుల మీదుగా ఈ స్టూడియోస్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, అల్లు కుటుంబ సభ్యులతో కలిసి ఈ స్టూడియోస్ ని చిరంజీవి ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గండిపేట్ లో 10 ఎకరాలలో ఈ స్టూడియోస్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ లకి అల్లు స్టూడియో కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండటం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక బయటి వ్యక్తులకు అనుమతి లేకుండా గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ స్టూడియో ఓపెనింగ్ జరిగిన తర్వాత స్టూడియోలో మొట్టమొదట జరిగే సినిమా “పుష్ప ది రూల్” అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు