Panjaa:పవన్ దర్శకుడితో అజిత్

తమిళనాట అజిత్ ఎదురులేని సూపర్ స్టార్. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అజిత్ సినిమా వస్తుందంటే.. విజయ్, సూర్య వంటి వారు కూడా వారి సినిమాల విడుదలను వాయిదా వేస్తారు. ఎలాంటి అభిమాన సంఘాలు లేకపోయినా.. సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్పంచుకోలేకపోయినా.. అశేషమైన క్రేజ్ ఉన్న అజిత్ కి అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది. అజిత్ సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ లో కూడా అజిత్ కు మంచి మార్కెట్ ఉంది. 51 ఏళ్లకు చేరువవుతున్నా.. వరుస సినిమాలతో ఫ్యాన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో అజిత్. కథ నచ్చితే చాలు జెట్ స్పీడ్ తో చిత్రాలు చేస్తుంటాడు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ తో అజిత్ ఓ సినిమా చేయబోతున్నాడు. తమిళ్ లో అజిత్ కుమార్ తో కూడా కొన్ని సాలిడ్ చిత్రాలు చేశాడు విష్ణువర్ధన్. ఈ కాంబోలో మళ్లీ చాలా రోజుల తర్వాత ఓ భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ భారీ పీరియాడిక్ సబ్జెక్ట్ అని.. అలాగే అజిత్ పాత్ర కూడా నెవర్ బిఫోర్ లెవెల్ లో ఉంటుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పంజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఒక సినిమా రూపొందనున్నట్లు సమాచారం. త్వరలో ఈ కాంబోపై క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు