Ravi Teja New Movie: తెరపైకి “కిక్ 3″… ఈ పరిస్థితుల్లో అంత ధైర్యం చేస్తారా?

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హిట్ కొట్టాలంటే ‘ కిక్ ‘ ఇచ్చే కంటెంట్ పడాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన “కిక్” మూవీకి థియేటర్ల టాప్ లేచిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ దీనికి సీక్వెల్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు చాలామంది సినీ ప్రియులు. మరి ఈ పరిస్థితుల్లో రవితేజ అంత ధైర్యం చేస్తారా? అంటే…

15 ఏళ్ల తరువాత “కిక్” రీ రిలీజ్
రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో “కిక్” కూడా ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ అప్పట్లో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా రవితేజ, ఇలియానా మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్, బ్రహ్మీ కామెడీ, తమన్ మ్యూజిక్, సాంగ్స్, సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సురేందర్ రెడ్డి ఈ మూవీ తోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారారు. అయితే 15 ఏళ్ల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీతో మరోసారి ఆడియన్స్ కు థియేటర్లలో కిక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మార్చ్ 1న “కిక్” రీ రిలీజ్ కాగా, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తెరపైకి “కిక్ 3″… పార్ట్ 2 బోల్తా
“కిక్” థియేటర్లలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ మేకర్స్ ను సీక్వెల్ ప్లాన్ చేయాలని కోరుతున్నారు. ఆ పోస్టులకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రవితేజలను ట్యాగ్ చేసి మరీ సీక్వెల్ కు ఇదే సరైన సమయమని సలహా ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు తెరపైకి “కిక్ 3” వచ్చింది. మేకర్స్ దృష్టికి వాళ్ల రిక్వెస్టులు వెళ్ళాయో లేదో. కానీ 15 ఏళ్ల తర్వాత కూడా “కిక్” మూవీని ఈ రేంజ్ లో ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే ఆ ఘనత ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికి చెందుతుంది.

- Advertisement -

కాగా ఇప్పటికే “కిక్” మూవీకి సీక్వెల్ గా “కిక్ 2” వచ్చిన విషయం తెలిసిందే. పార్ట్ 2కు కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రవితేజ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కానీ 2015 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మరో సీక్వెల్ కు ప్రయత్నించలేదు మేకర్స్.

రవితేజ ఆ సాహసం చేస్తాడా?
ప్రస్తుతం వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు రవితేజ. “క్రాక్” తర్వాత లాటరీలో వచ్చిన “ధమాకా” బ్లాక్ బస్టర్ తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా ప్లాఫ్ అయ్యాయి. “వాల్తేరు వీరయ్య” మూవీ హిట్ అయినప్పటికీ అది రవితేజ సినిమా అని చెప్పలేము. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు” కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన “ఈగల్” మూవీ రవితేజకు హిట్ ఇవ్వలేకపోయింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్నాడు మాస్ మహారాజా. మరోవైపు సురేందర్ రెడ్డికి “ఏజెంట్” అట్టర్ ఫ్లాప్ తో అవకాశాలు కరువయ్యాయి. మరి ఇలాంటి బ్యాడ్ టైంలో రవితేజ “కిక్ 3″కి ధైర్యం చేస్తాడా? అంటే సందేహమే. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో “మిస్టర్ బచ్చన్” అనే సినిమాను చేస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు