సినిమా ఒక ఊహ ప్రపంచం దీనితో స్వర్గ నరకాలను చూపించొచ్చు.
సినిమా ఒక అద్భుతమైన పెయింటింగ్ దీనిపై ఒక అందమైన ప్రేమ కథను చెప్పొచ్చు. సినిమా ఒక విధ్వంసం ఒకే కత్తితో వందమందిని మట్టికరిపించొచ్చు. సినిమా ఒక పాఠం తెలుగు హీరోలతో మెసేజెస్ చెప్పించొచ్చు.
సినిమా అంటే వినోదం, ప్రేక్షకుడు టికెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేయడమే మన లక్ష్యం అని బలంగా నమ్మిన దర్శకుడు మారుతి.మన ఆలోచన ఆటోవాడికి కూడా అర్ధమవ్వాలి, ఆడియన్స్ కి ఇష్టమైన సినిమాలు మాత్రమే తియ్యాలి, మనకు ఇష్టమైన సినిమాలను వాళ్ళ మీదకి రుద్దకూడదు అని సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు.
Read More: Ajay Bhupathi: ఈ ఫ్రైడే 3 సినిమాలు..విజేత ఆ సినిమానేనా..?
తన కెరియర్ లో సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్ డిజైనర్‌గా పని చేసిన మారుతి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి క్యామ్ తో చేసిన”దొంగలముఠా” సినిమా నుంచి ఇన్స్పైరై, 5డి క్యామ్ తో ఆ రోజుల్లోనే “ఈరోజుల్లో” అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి యూత్ ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత బస్ స్టాప్ మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ప్రేమకథా చిత్రంతో నిర్మాతగా మారాడు మారుతి.
కేవలం యూత్ కి దగ్గరయ్యే సినిమాలు మాత్రమే కాకుండా అల్లు శిరీష్‌తో కొత్తజంట, వెంకటేశ్‌తో బాబు బంగారం, నానితో భలే భలే మగాడివోయ్, శర్వానంద్‌తో మహానుభావుడు, నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, సాయిధరమ్ తేజ్‌తో ప్రతిరోజు పండగే.. ఇలా ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు దర్శకుడు మారుతి.
Read More: Dhanush: సార్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో
ఇప్పుడున్న రోజుల్లో 30 రోజుల్లో సినిమా చేయడం అంటే మాటలు కాదు.
కేవలం నెల రోజుల్లోనే “మంచిరోజులొచ్చాయి” అనే సినిమాను తీసి.. విడుదలకు సిద్ధం చేసాడు మారుతి. వినోదభరితమైన చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేస్తున్నాడు. అనుకుంటే అసాధ్యం ఏదీ లేదని, మాటల్లో కాకుండా చేతల్లో చూపించాడు దర్శకుడు మారుతి. ఇలానే మరిన్ని హిట్ చిత్రాలని చేస్తూ విజయాలను అందుకోవాలని నేడు మారుతి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు.
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...