RX100: పాయల్ బ్యూటీని వాడుకుంటున్న డైరెక్టర్- మంగళవారం టీజర్ విడుదల

పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ” మంగళవారం ” పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉన్న టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న పాయల్ రాజపుత్ మరియు డైరెక్టర్ అజయ్ భూపతి రెండోసారి మంగళవారం అనే విమెన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ముద్ర మీడియా వర్క్ ,ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై స్వాతి రెడ్డి గుణపటి, సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో నందిత శ్వేతా, అజయ్ గోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇక టీజర్ విషయానికొస్తే ఇటీవల కాలంలో ఎక్కువగా పల్లెటూరు నేపథ్యంలో వస్తున్న సినిమాల కోవలనే ఈ సినిమా కూడా ఉండబోతుందని అని తెల్సుతోంది. విజువల్స్ ఆసక్తి కరంగా ఉండగా, మ్యూజిక్ టీజర్ లో హైలెట్ అయింది. అలాగే టీజర్ కట్ చేసిన విధానం కొత్తగా ఉంది. అయితే అజయ్ భూపతి తీసిన గత రెండు చిత్రాల తరహాలో ఈ సినిమాలో కూడా ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉన్నట్టు తెల్సుతోంది. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో కూడా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ ఇచ్చినట్టే స్పష్టమవుతోంది. డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ బ్యూటీని అడ్డం పెట్టుకొని మరోసారి మంగళవారం సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నట్టు తెల్సుతోంది. మరీ ఈ సినిమాతో వీళ్ళ ఇద్దరి హిట్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు