Kriti Sanon : డార్లింగ్ నే పెళ్లి చేసుకుంటా

టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమై, బాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్ కృతి సనన్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1 : నేనొక్కడినే అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. కృతి సనన్ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో పాటు అదే సమయంలో టైగర్ ష్రాఫ్ తో బాలీవుడ్ లో హీరోపంతి సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

దీని తర్వాత తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో దోచేయ్ లో చేసింది. ఇది కూడా బోల్తా పడింది. మళ్లీ ఇక ఈమె టాలీవుడ్ వైపు చూడలేదు. కానీ బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఈ భామ నటించిన భేదియా తెలుగులో తోడేలు చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మిశ్రమ టాక్ తో ఈ చిత్రం థియేటర్ లో రన్ అవుతోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

భేదియా సినిమా ప్రమోషన్ లలో ఈ భామకు ఒక ప్రశ్న ఎదురైంది. ”కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ లలో ఎవరితో.. ఫ్లర్ట్ చేస్తారు ? ఎవరితో డేట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?” అని ప్రశ్న రాగా.. దీనికి సమాధానంగా కృతి సనన్… “కార్తీక్ ఆర్యన్ తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్ తో డేట్, ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ చెప్పడంతో గత కొన్ని రోజుల నుంచి ప్రభాస్-కృతి సనన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అని వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతుంది. ప్రభాస్-కృతి సనన్ ప్రేమ నిజమే అని, కృతి సనన్ ఈ విధంగా క్లూ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు