Ramarao on Duty : రవితేజ కింగ్ ఆఫ్ ది క్రౌడ్

మాస్ మహారాజ రవితేజ నుండి తాజాగా వస్తున్న సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. కొత్త డైరెక్టర్ శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “రామారావు ఆన్ డ్యూటీ” రూపొందింది. ఎస్ ఎల్ వీ సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టంపూడి కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. “ఖిలాడి” సినిమాతో ప్లాప్ అందుకున్న రవితేజ ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచింది. మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

తాజాగా చిత్ర యూనిట్ “రామారావు ఆన్ డ్యూటీ” టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది. కింగ్ ఆఫ్ ది క్రౌడ్.. అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో రవితేజ పాత్రను తెలిపేలా ఈ పాట సాగుతుంది. పాట మధ్యలో ‘కింగ్ ఆఫ్ ది క్రౌడ్.. లీడర్ ఆఫ్ ది ప్యాక్’ తో పాటు ‘హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ రెబల్.. బట్ ఏ సన్ ఆఫ్ ది ల్యాండ్’ అంటూ సాగే లిరిక్స్ సినిమాలో రవితేజ వ్యక్తిత్వాన్ని తెలిపేలా ఉన్నాయి. పాట పూర్తిగా ఇంగ్లీష్ లోనే సాగినా, మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. దీంతో పాటు సామ్ సీఎస్ అందించిన సంగీతం మరింత ఊపును ఇస్తుంది.

డైరెక్టర్ శరత్ మండవ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. లవితా లోబో గొంతు ఈ పాటకు హైలైట్ గా ఉన్నాయి. కాగ, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కిడ్నాప్ అయిన కార్మికుల కేసు దర్యాప్తు నేపథ్యంలో సినిమా సాగుతుందని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు