Cobra : ఒకటి రెండు కాదు. ఏకంగా ఏడు ?

చియాన్ విక్రమ్ గురించి తెలియని వారుండరు. కోలీవుడ్ హీరో అయినా, తెలుగు ఆడియన్స్ కు కూడా విక్రమ్ పరిచయమే. ఆయన నటించిన అపరిచితుడు సినిమాను 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు మర్చిపోలేము. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. మూడు పాత్రలలో విక్రమ్ చూపించిన వేరియేషన్స్ అప్పట్లో కొత్తగా అనిపించింది. దీన్ని చూసి తర్వాత చాలా మంది దర్శకులు డబులు రోల్ సినిమాలను తెరకెక్కించారు.

ఈ స్టార్ హీరో మరోసారి ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కోబ్రా అనే సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో విక్రమ్ ఏడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడట. ప్రతి ఒక్క పాత్రకు ప్రత్యేకత కూడా ఉంటుందని కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఏడు పాత్రలకు డబ్బింగ్ కూడా స్వయంగా విక్రమ్ చెబుతున్నారని టాక్. దీని కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు సమాచారం.

చియాన్ విక్రమ్ కు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో విక్రమ్ ప్రయోగాలు చేశారు. అలాంటి కొన్ని సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. మరికొన్ని హిట్ అయ్యాయి. మరి ఈ ప్రయోగాత్మక చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. కాగ ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కావాలి. కానీ వాయిదా వేశారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు