Bandla Ganesh : ‘వారసత్వం కాదు టాలెంట్’

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. రికార్డు స్థాయిలో వ్యూస్ ను సాధిస్తు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను కూడా విపరీతంగా పెంచింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.

ఈ ఈవెంట్ లో ‘మా అయ్య తెల్వదు. మా తాత తెల్వదు. ఎవడు తెల్వదు. రెండేళ్లు అవుతుంది సినిమా రిలీజ్ అయి. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్ కే ఈ రచ్చ ఏంది రా’ అంటూ వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ. లైగర్ ట్రైలర్ ఎంత స్పీడ్ గా వెళ్లిందో ఈ వ్యాఖ్యలు కూడా అంతే స్పీడ్ గా బయటకు వెళ్లాయి. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై నెటిజన్లు కౌంటర్లు వేశారు. వారసత్వంతో ఎదిగిన హీరోలనే ఉద్దేశించి విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీకి వారసత్వంతో రాలేదా అంటూ ప్రశ్నించారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించాడు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా మహేష్ బాబు లా రామ్ చరణ్ లా అది గుర్తు పెట్టుకో బ్రదర్’ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. బండ్ల పోస్టు లో విజయ్ పేరు పెట్టకుండానే కౌంటర్ ఇచ్చాడు. అయితే మెగా ఫ్యామిలీకి బండ్ల గణేష్ ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు