Kiara Advani: తల్లి కాబోతుందా?

గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరించిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జైసల్మేర్ లోని ఓ స్టార్ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షేర్హ సినిమా సమయంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు కియారా – సిద్ధార్థ్. ఆ సమయంలోనే వాళ్ళ మధ్య స్నేహానికి మించిన బంధం ఏర్పడింది. అది ప్రేమగా మారి అప్పటినుండి ప్రేమలో ఉన్న ఈ జంట పక్షులు ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు.

ఇదిలా ఉంటే.. గత రెండు మూడు రోజుల నుండి కియారా అద్వానీ గర్భవతా? అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే మొన్నే కదా పెళ్లి అయింది? అంటారేమో.. అంటే అలియా భట్ – రణబీర్ కపూర్ సంగతి చూశాక ఏ విషయం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు.

పెళ్లికి, బిడ్డను కనడానికి మధ్య ఉండాల్సిన గ్యాప్ లేదు అని అప్పుడు అనుకున్నారు. అయితే ఇప్పుడు కియారా గర్భవతా? అనే ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే ఇటీవల ఆమె వేసుకున్న డ్రెస్. కియారా ఇటీవల బ్లాక్ అండ్ వైట్ పోల్క డాట్ డ్రెస్ ధరించింది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది పోల్కా డాట్ స్టైల్ లోనే ఉన్న డ్రెస్సులు వేసుకునే తమ ప్రేగ్నెన్సీ ని ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కియారా కూడా అలాంటి డ్రెస్ ధరించడంతో ప్రెగ్నెంట్ అన్న విషయం చెబుతుందేమోనని అంతా అనుకున్నారు. అలా కియారా గర్భవతా? అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు