Srinidhi Shetty : షాకింగ్ నిర్ణ‌యం !

ఒకే సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది ఈ బ్యూటీ. ఆమె న‌టించిన మొద‌టి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో రెమ్యూన‌రేషన్‌ కూడా ఒకేసారి అమాంతం పెంచేసింది. ఈమెకు ఉన్న క్రేజ్ చూసి ఇక రెండో సినిమాకి అడిగినంత ఇచ్చేశారు నిర్మాత‌లు. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయింది. దీంతో ఈ హీరోయిన్‌ ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది. ఇక ఆ హీరోయిన్ ఎవ‌రో కాదండోయ్‌.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టి.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. మొద‌టి సినిమానే పాన్ ఇండియా సినిమా అవ్వ‌డం.. ఇక ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా త‌రువాత ఈ బ్యూటీకి క్రేజీ ఆఫ‌ర్ వచ్చేసింది. త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ న‌టించిన కోబ్రా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో శ్రీ‌నిధికి ఛాన్స్‌లు ఇవ్వాలంటే నిర్మాత‌లు కాస్త ఆలోచన‌లో ప‌డ్డార‌ట‌.

ఈమెకి రెమ్యూన‌రేష‌న్ అంత ఇచ్చే దానికంటే వేరే హీరోయిన్‌ని తీసుకుంటే బెట‌ర్ అని కూడా ఆలోచిస్తున్నార‌ట‌. అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డం అవ‌స‌రమా అని అనుకుంటున్నారట నిర్మాత‌లు. దీంతో శ్రీ‌నిధి రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని టాక్ వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు