Kasinadhuni Viswanath: తపశ్వి కి నివాళి

సినిమా కొందరికి వ్యాపారం
ఇంకొందరికి వ్యాపకం
మరికొందరికి వ్యసనం
ఇంకొంతమందికి వినోదం
ఒకటి మాత్రమే కాదు ఇలా ఇంకెన్నో
ప్రేమ, ఓదార్పు ,బాధ, సంతోషం, ప్రళయం Etc..
కానీ వీటన్నటినింటిలో కళాతపశ్వి సినిమా వేరు.

కళాతపశ్వి కే విశ్వనాథ్ సినిమా అంటే కేవలం వ్యాపారం కోసం చేసింది కాదు, విలువలు కోసం చేసింది. తమకు నచ్చిన సినిమా తీసే దర్శకులు కొందరైతే, తమకు వచ్చిన సినిమాను తీసిన దర్శకులు ఇంకొందరు.
తనకు నచ్చిన సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా చేయడం కళాతపశ్వి కే విశ్వనాథ్ శైలి. ఆయన కథల్లో పాత్రలే హీరోలు, ఆ పాత్రలు కొడితే పదిమంది విలన్లు గాల్లో ఎగరకపోయినా, ఆయన సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు మనసు మాత్రం హాయిగా విహరిస్తోంది.

ఆయన సినిమాల్లోని సంగీతం, సాహిత్యం పరిమళిస్తుంది. ఒకటా రెండా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో వందలు. కులాలు, కళలు, సాహిత్యాలను ఆయన చూసిన విధానం, చూపించిన విధానం ఖచ్చితంగా మనలను ఆలోచించేలా చేస్తుంది.

- Advertisement -

చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రయాణం, అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేసారు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు.

భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం చిత్రాలతో పాటు, సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ఆయనకు దర్శకుడిగా ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకుని వచ్చాయి. ఆయన సినిమాల్లోని ప్రతి సీను గురించి మాట్లోడొచ్చు, ప్రతి మాట గురించి ప్రస్తావించొచ్చు. ఒకసారి ఆయన సినిమాలను పరిశీలిస్తే..

Shankara Bharanam
Shankara Bharanam

త్యాగరాజు ఉత్సవాలు జరుగుతున్నాయి,
శంకరశాస్త్రి గారు కచేరి కి కూర్చున్నారు,
ఒక పతిత వచ్చి కూర్చోగానే అందరు లేచి వెళ్ళిపోతారు,
చివరిగా మంజు భార్గవి కుడా వెళ్ళిపోతుంది,
కాని ఆ సినిమా చివర్లో అదే పతిత
పెట్టించిన కచేరి కి అందరు వస్తారు.
కచేరి అయిపోయాక శంకరశాస్త్రి చనిపోతారు,
ఆమె అతని పాదాలు దగ్గర పడి చనిపోతుంది,
అక్కడ అతని సంగీతానికి వారసుడు అని
పిల్లోడిని చూపిస్తాడు.

Saptapadi

ఒక గుడిలో ఎప్పుడు పౌరాహిత్యం
జరిగించే ఒక పూజారి తన అత్త కూతురిని
పెళ్లి చేసుకుని కుడా తనని కనీసం తాకకుండా
తన అంతరంగాన్ని తెలుసుకుని
ఒక హరిజనయువకుడిని తనే స్వయంగా
తీసుకురావడానికి బయలుదేరుతాడు.
లోక ధర్మాన్ని సంప్రదాయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదిపురుషుడు జగత్ గురువు అయినా ఆదిశంకరుడే హరిజనుడుని ఆదరించినప్పుడు మనం ఎంత యాజులు గారు.
అసలు నన్నడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైనది కులం.
అని రాజులు (అల్లు రామలింగయ్య) చెప్పిన మాటలు విని.
సినిమా చివర్లో సోమయాజులు
ఆ మనువరాలను తీసుకొచ్చి
ఏరు దగ్గర అందరు ఒక కులాన్ని తక్కువ
చేసి మాట్లాడితే అక్కడ అదే సోమయాజులు
కొన్ని గొప్ప మాటలు చెప్పి ఆ పిల్లకు
ఆ హరిజన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తాడు.!

SagaraSangamam

ఒక ఓడిపోయిన వాడు
సినిమా మొదట్లోనే చూపిస్తాడు,
నాట్యాన్ని కోరుకుంటాడు చివరివరకు
అతనికి ఆ నాట్యం దొరకదు,
అలానే చనిపోతాడు.
ఒక ఓడిపోయిన వాడి కథను మళ్ళీ, మళ్ళీ
ప్రేక్షకులు చూడగాలిగేలా చేసారు.

ఒక గుడ్డివాడు పెద్ద సంగీత విద్వాంసుడు,
ఒక మూగపిల్ల బొమ్మలు వేస్తుంది
రచనలు చేస్తుంది.
ముఖ్యమైన పాత్రలకు లోపాలను పెట్టి
కొన్ని లక్షల మందిని దియేటర్ కి తీసుకొచ్చాడు
ఒక సిరివెన్నల సినిమా ద్వారా.

ఆయన సినిమాల్లోని కొన్ని మాటలను గమనిస్తే

ఆచార వ్యవహారాలు మనసులను క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప,
మనుషులను కులం అనే పేరుతో విడదీయడానికి కాదు.!
– శంకరాభరణం

తన విధిని తాను నిర్వర్తించక
హరిషడ్ వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడు కంటే
పవిత్రమైన నడవడి గల శుద్రుడుకి తలవంచి నమస్కరిస్తాను నేను

– సప్తపది
ఇలాంటి కుల నిర్మాణానికి దోహదపడే మాటలు వినినిపిస్తాయి.
బహుశ ఈ దర్శకుడుకి కూడా కులాన్ని అంటగట్టడం కొంతమంది అవివేకం అనిపిస్తుంది.

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది
ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది
లాంటి సాహిత్యాన్ని రాయగలిగే ఒక సన్నివేశాన్ని సినిమాలో క్రియేట్ చెయ్యడం ఆయనకు మాత్రమే చెల్లింది.

ఆది భిక్షువు వాడిని ఏది కోరేది
బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది

సిరివెన్నల సినిమాలో ఇలా శివుణ్ణి ప్రశ్నించే సాహిత్యాన్ని పొందుపర్చాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి.

గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ

అని సాక్షాత్తు రాముణ్ణి ఒక సాహిత్య రచయిత తో అనిపించడం అంత తేలికైన విషయమా.?

ఇలాంటివే కే విశ్వనాధ్ గారి సినిమాల్లో మనకు బోలెడు తారసపడతాయి
ఒక.. స్వాతిముత్యం, శుభసంకల్పం, సిరిసిరిమువ్వ, చెల్లెలకాపురం,
స్వర్ణకమలం, స్వయంకృషి ఇలా కె.విశ్వనాథ్ సినిమాలు గురించి
చెప్పుకుంటే పోతే ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుంది.

తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం శ్రీ కాశీనాధుని విశ్వనాధ్ మనతోనే ఉంటారు.

ఎందుకంటే… “No End For Any Art”

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు