Kareena Kapoor Bold Images: డర్టీ హీరోయిన్… ఇంత ఏజ్ వచ్చినా ఇదేం పాడు బుద్ధి?

టైమ్‌లెస్ బ్యూటీ కరీనా కపూర్‌ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆమె తాజాగా చేసిన ఓ బోల్డ్ ఫోటో షూట్ పై డర్టీ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాషన్ ఐకాన్ కరీనా కపూర్ ఖాన్ ను ఆమె ఫ్యామిలీ, స్నేహితులు, అభిమానులు ప్రేమగా బెబో అని పిలుస్తారు. ఆమె ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. ఈ బ్యూటీకి 43 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ గానీ కన్పిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ లవ్లీ లేడీ గ్లామర్ విషయానికి వస్తే యంగ్ హీరోయిన్లకు ఇప్పటికీ గట్టి పోటీని ఇస్తోంది. ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినప్పటికీ, పలు షోలు, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీంతో ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పొచ్చు. ఇక కరీనాకు ఉన్న ఈ ఫాలోయింగ్ నే క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు ఓ మ్యాగజైన్ వారు.

కరీనా ఇటీవల ‘డర్టీ’ మ్యాగజైన్ కోసం ఒక అద్భుతమైన ఫోటో షూట్‌ చేసింది. థై-స్లిట్ స్ట్రాప్‌లెస్ రెడ్ దుస్తుల్లో యూత్ ను టీజ్ చేసే పోజ్ ఇచ్చింది. అంతేకాదు ఒక సోఫాపై పడుకుని స్కిన్ కలర్ డ్రెస్ లో మెరిసింది. మరో షాట్‌లో ఆమె తన కళ్లతో చూపరులను కట్టిపడేసింది. ఈ మోనోక్రోమ్ షాట్ ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్ ఖచ్చితంగా యూత్ కి ఒక ట్రీట్. కరీనా ఫోటో షూట్ కుర్రాళ్లలో సైతం సెగలు పుట్టిస్తోంది. అయితే ఇదంతా చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం డర్టీ హీరోయిన్… ఇంత ఏజ్ వచ్చినా ఇదేం పాడు బుద్ధి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా కరీనా గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆమె ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’లో నటిస్తోంది. అంతేకాదు హన్సల్ మెహతా కొత్త మూవీలో కూడా కనిపించనుంది. ఇక కృతి సనన్, దిల్జిత్ దోసాంజ్, టబుతో కలిసి ‘ది క్రూ’లో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. కరీనా ఇటీవలే ఓటిటిలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేసి విఫలమైంది. ఇక ఆమె భర్త సైఫ్ అలీఖాన్ త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’లో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు