Kangana Ranaut : జ్యోతికతో కంపేర్ వద్దు..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రానౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. ఓవైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు ఇతర భాష చిత్రాలలోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం కంగనా సౌత్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఈ బ్యూటీ తమిళంలో ‘తలైవి’ అనే సినిమాలో నటించింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా మరో తమిళ సినిమా “చంద్రముఖి 2” లో ఈ భామ నటించనుంది. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాకు సబంధించిన విశేషాలను మీడియాతో పంచుకుంది కంగనా రనౌత్. ఈ సందర్బంగా చంద్రముఖి ఫస్ట్ మూవీలో నటించిన జ్యోతికాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. “చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన సాటిలేనిది.. ఆమెకు ధీటుగా నటించడం తనకే కాదు ఇంకెవరికీ సాధ్యం కాదు.. చంద్రముఖిగా జ్యోతిక అద్భుతంగా నటించారు. ఆ స్థాయిలో నటించే అంత సీన్ నాకు లేదు ఈ సినిమాను చూసేవారు కూడా ఈ పాత్రలో నన్ను మాత్రమే చూడాలని జ్యోతిక తో నన్ను కంపేర్ చేస్తే నిరాశ తప్పదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు