Indian2 :సేనాపతి తిరిగొచ్చారు

విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ తన తర్వాతి సినిమా పై ఫోకస్ పెట్టారు. 2019 లో స్టార్ట్ అయిన ఇండియన్ 2 చిత్రాన్ని తిరగి ప్రారంభించారు. ఈ సినిమా 2019 లోనే ప్రారంభం కాగా, 2020 ఫిబ్రవరిలో షూటింగ్ సెట్ ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వాయిదా పడింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ప్రారంభమైంది. దీని డైరెక్టర్ శంకర్ ఇప్పటికే ఆర్సీ 15 సినిమా చిత్రీకరణలో ఉన్నా, కమల్ కోసం వచ్చారు.

ఇటీవలే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది. తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో పాటు లోక నాయకుడు కమల్ హాసన్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గురు వారం రోజున కమల్ హాసన్ మూవీ యూనిట్ తో కలిశారు. ఈ సందర్భంగా కమల్ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్రాలను ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో షేర్ చూస్తూ, ‘మా సేనపతి తిరిగొచ్చారు’ అంటూ ఒక క్యాప్షన్ ను జోడించింది. కాగా షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత దర్శకుడు శంకర్ తిరిగి ఆర్సీ 15 సెట్స్ పైకి రానున్నారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను కొంత వరకు పూర్తిచేసుకుని మళ్లీ ఇండియన్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇలా ఏక కాలంలో రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు