Kaikala Satyanarayana : ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఆరోగ్య పరిస్థితి నేడు ఉదయం మరింత క్షీణించడంతో ఫిలింనగర్ లోని ఆయన ఇంటి వద్ద వైద్యులు చికిత్స అందిస్తుండగా.. చికిత్సకు స్పందించక ప్రాణాలు విడిచారు. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందించారు. అనంతరం కోలుకొని డిస్చార్జ్ కూడా అయ్యారు. తాజాగా మరోసారి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు కైకాల. 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ పాత్రలలో దాదాపు 770 కి పైగా చిత్రాలలో సత్యనారాయణ నటించారు. ఆయనకి ఇద్దరు కూతుర్లు, కుమారులు ఉన్నారు. కైకాల సత్యనారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కొని నెల్లలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్ ను కోల్పోయింది. కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ వంటి గొప్ప నటులు మరణ వార్త నుంచి కోలుకోక ముందే కైకాల మరణ వార్త విషాదంలోకి నెట్టేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు