Devara : జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం ? కారణం ఏంటంటే..

టాలీవుడ్ లో ఉన్న హీరోలందరు వారి, వారి కెరీర్ గురించి మరియు పర్సనల్ లైఫ్ గురించి తీసుకునే నిర్ణయాలు ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు షాక్ కి గురి చేస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం స్టార్ హీరోల నుంచి నిన్న, మొన్న ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరోల వరకుచాలా మందే తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ హీరో కూడా చేరాడు అతనెవరంటే జూనియర్ ఎన్టీఆర్.

RRR సినిమాతో యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెల్సిందే. ఈ సినిమా తరువాత వెంటనే ఎన్టీఆర్ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ సినిమా పనులు మొదలవనున్నాయి. అలాగే హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

ఇలా భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తొందర్లోనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ ప్రొడక్షన్ హౌస్ కి సీనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చేల ఉండే నేమ్ ని పెట్టలని కూడా చూస్తున్నాడట. టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ సినిమాలతో పాటుగా బిజినెస్ రంగాలలో కూడా దూసుకుపోతుండటంతో, ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాక్. మహేష్ బాబు థియేటర్ బిజినెస్ లో, రామ్ చరణ్ ఎయిర్ వేస్ మరియు ప్రొడక్షన్ హౌస్ తో, అల్లు అర్జున్ ఆహా అనే ఓటిటి ఫ్లాట్ ఫామ్ తో ఎవరి వ్యాపారాలతో వాళ్ళు బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి సన్నిహితులు చెబుతున్నారు.

- Advertisement -

అయితే ఎన్టీఆర్ అందరికి భిన్నంగా యూట్యూబ్ లో మరియు ఓటిటీలలో కంటెంట్ క్రియేట్ చేస్తున్న యంగ్ ఫిలిం మేకర్స్ కి అవకాశం ఇవ్వడానికి ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. తొందర్లోనే ఈ విషయం పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.అయితే ఈ న్యూస్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భిన్న అభిప్రాయాలు తెలెత్తుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు