బుల్లితెర అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు.. సుమ కనకాల. దాదాపు 20 ఏళ్ల పై నుంచి బుల్లి తెర పై కనిపిస్తున్న సుమక్క.. క్వీన్ ఆఫ్ బుల్లితెర గా ఎదిగింది. సినిమాల వైపు దృష్టి పెట్టకుండా.. కేవలం యాంకరింగ్ ద్వారానే స్టార్ ఇమేజ్ ను పెంచుకుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హీరోయిన్ గా చేసింది. మళ్లీ ఇప్పుడు మరో సారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి రెడీ అవుతుంది.
సుమ కనకాల మెయిన్ రోల్ లో జయమ్మ పంచాయితీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ కుమార్ కలివరపు.. తెరకెక్కుతున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లలో రిలీజ్ కాబోతుంది. కాగ తాజా గా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఉన్న ఈ ట్రైలర్.. సినీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.
కాగ ఈ ట్రైలర్ లో సుమక్క యాక్టింగ్ చూసి ఫీదా అవుతున్నారు. ట్రైలర్ లో ఇతర నటీ నటులు ఉన్నా.. పూర్తి డామినేషన్ సుమక్క దే ఉంటుంది. వన్ ఉమెన్ షో లా ఉంది. శ్రీకాకులం యాసలో సుమక్క డైలాగ్స్, వాటి టైమింగ్.. రైమింగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ట్రైలర్ లోనే ఇలా ఉంటే.. మూవీలో జయమ్మ నట విశ్వరూపం చూడాల్సిందే.. సినీ లవర్స్ అంటున్నారు.