Janhvi Kapoor: ఆ మాటలు బాధిస్తాయి

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పుడు తన భారీ అందాలతో కుర్రాలను రెచ్చగొడుతూనే ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వి కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

అయితే నటిగా ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి తరచూ విమర్శలు ట్రోల్స్ ఎదుర్కొంటున్నానని, కొన్నిసార్లు ఆ మాటలు భాధిస్తాయని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ చేశారు. తనపై వచ్చే ట్రోల్స్ చూసి విసిగిపోయినట్లు తెలిపింది. ఎంత కష్టపడినా అందులో తప్పులు వెతుకుతూ, విమర్శిస్తూనే ఉంటారని వాపోయింది. మనం ఏం చేసినా, ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు.

ఎప్పుడు సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వారికి అంత సంతోషం. విమర్శించడంలో వారు ఆనందం పొందుతారు. మనపై చేసే కామెంట్లతో వార్తల్లో నిలుస్తారు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వార్తలు చదివి చదివి కొంత కాలానికి ప్రజలు విసిగిపోతారు. దురదృష్టమేంటంటే మనపై వచ్చే ట్రోల్స్ కూడా ప్రజలను విసిగిపోయేలా చేస్తాయి అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నెపోకిడ్ అంటూ ట్రోల్ చేస్తూనే ఉన్నారని, సినిమాలు రిలీజ్ అయినప్పుడు నెపోకిడ్ నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తారని అన్నారు. అలాంటి ట్రోల్స్, కామెంట్స్ చూసి బాధపడుతుంటానని నా బలాలు, బలహీనతలు నేను ఎలా నటిస్తున్నాను నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది జాన్వి. ఆ మాటలు చాలా ఎక్కువగా బాధిస్తాయని తెలిపారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు