Ram Gopal Varma : రాజకీయ “వ్యూహాం” అదిరింది

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి డోస్ మరింత పెంచేసి మరో సినిమా అనౌన్స్ చేశారు. సినిమా పేరు వ్యూహం. ఇది బయోపిక్ అని అడగక ముందే కాదు.. అంతకు మించి అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. త‌న వ్యూహం సినిమా రెండు పార్టులుగా రాబోతుంద‌ని.. దీనిని పొలిటిక‌ల్ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు వ‌ర్మ‌.

బ‌యోపిక్‌లో అయినా అబ‌ద్దాలు ఉండ‌వ‌చ్చు కానీ రియ‌ల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయన్నారు. తాజాగా వ్యూహం సినిమా ఫార్ములా ఏంటో బ‌య‌ట‌పెట్టారు వ‌ర్మ‌. BJP ÷ PK x CBN – LOKESH + JAGAN = వ్యూహం ఓ ట్వీట్ చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రాచ‌కురుపు పై వేసిన కారంతో బొబ్బ‌లెక్కిన ఆగ్ర‌హానికి ప్ర‌తికాస్టే వ్యూహం. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంద‌ని, వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే వారికి శ‌ప‌థం రూపంలో మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ పార్టీల, విధి విధానాల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ కి పాజిటివ్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. రామ్ గోపాల్ వ‌ర్మ ఫార్ములాలో + JAGAN అని ఉండ‌డం విశేషం. ఈ సినిమా తెర‌పైకి ఎక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక‌వేళ సినిమాని తీస్తే ఏపీలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు వ‌ర్మ పై కౌంట‌ర్లు వేయడం ప‌క్కాగా క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు