Poonam Kaur : పెళ్లి అయిందా ?

న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే విష‌యం తెలిసిందే. గ‌తంలోనే త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో తీవ్ర ఒత్తిడికి లోన‌య్యాన‌ని, త‌న పేరు పూర్తిగా దెబ్బ‌తింద‌ని ప‌లుమార్లు చెప్పుకొచ్చిన విష‌యం విధిత‌మే. గ‌త కొంత‌కాలంగా వెండితెర‌కు చాలా దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.

తాజాగా పూన‌మ్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క‌ర్వాచౌత్ శుభాకాంక్ష‌లు చెబుతూ చేతిలో జ‌ల్లెడ‌ను ప‌ట్టుకుని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూన‌మ్ కౌర్ సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం దీనిపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే త‌మ భ‌ర్త క్షేమాన్ని కోరుతూ క‌ర్వాచౌత్‌ను పెళ్లయిన మ‌హిళ‌లే జ‌రుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగ‌ను ఎక్కువ‌గా జ‌రుపుకుంటారు.

భ‌ర్త పేరు మీద ఉప‌వాసం చేసి జ‌ల్లెడ‌లో చంద్రుడిని చూసిన వెంట‌నే భ‌ర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కానీ పూన‌మ్ క‌ర్వాచౌత్ ఫోటోను షేర్ చేయ‌డంపై నెటిజ‌న్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మీకు ఇదివ‌ర‌కే పెళ్లి అయిందా..? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా అని పూన‌మ్ పోస్ట్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.పూన‌మ్ కౌర్ మాత్రం ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు