OTT : హిట్2 వచ్చేస్తోంది

అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా మొదట కొంత విభిన్నమైన టాక్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా హిట్ 2 నిలిచింది.

అంతేకాకుండా అడవి శేష్ కెరిర్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్ రన్ దాదాపు పూర్తయినట్లే. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ ట్రేడ్ లో హిట్ 2 చిత్రానికి భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం అమెజాన్ భారీ గానే చెల్లించిందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా, చివరకు ప్రైమ్ వీడియోకే భారీ తరపు ఈ రైట్స్ దక్కాయి. ఈ సినిమా జనవరి నెలలో ఓటీటీలోకి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి నెల మొదటి వారంలో జనవరి 2, జనవరి 6 కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు