Naresh: అల్లరోడు ఆ హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపాడా..?

సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన అల్లరి నరేష్ కామెడీ చిత్రాలతో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అల్లరి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్.. ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు.

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే ఒక బ్రాండ్ లాగా ఉండేది. అయితే కేవలం హాస్యభరిత చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తుండడం, ఒకే పంథా ఫాలో అవడంతో చాలా ఏళ్లుగా హిట్ ను దక్కించుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితులలో “నాంది” అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడి నుండి కామెడీ మూవీస్ ని పక్కన పెట్టేసి సీరియస్ కథలను ఎంచుకుంటూ తన నటనలో మరో కోణం చూపిస్తున్నాడు అల్లరి నరేష్.

అయితే తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయం చర్చనీయాంశమైంది. కెరీర్ ప్రారంభంలో నరేష్ ఓ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని కూడా ఫిక్స్ అయ్యారాట. ఆమె ఎవరో కాదు.. “బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్”, సీమశాస్త్రి వంటి చిత్రాలలో నరేష్ తో కలిసి నటించిన ఫర్జానా.

- Advertisement -

అయితే నరేష్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవట. కానీ ఆమె కోసం నరేష్ ఎంత గొడవపడినా తగ్గుతూ వచ్చేవాడట. ఈ విషయంపై అల్లరి నరేష్ కూడా తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఫర్జానా పెళ్లి చేసుకుని అమెరికాలో ఉందని, మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు