Haripriya:పెళ్లి పీటలు ఎక్కబోతున్న నాని హీరోయిన్

కన్నడ బ్యూటీ హరిప్రియ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, పిల్ల జమిందార్, జై సింహ వంటి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం వరుస కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. కన్నడ నటుడు వశిష్ట సింహతో హరిప్రియ కొంతకాలంగా ప్రేమలో ఉంది.

కేజిఎఫ్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వశిష్ట, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి తెలుగు సినిమాలలోను నటించి మెప్పించాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వశిష్ట, హరిప్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో హరిప్రియ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్ధపు వేడుకలో నటి హరిప్రియ పసుపు రంగు చీరలో ఆకట్టుకుంటుంది. నటుడు వశిష్ట సింహ కూడా పసుపు రంగులోని సాంప్రదాయ దుస్తుల్లోనే మెరిశారు.

వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా హరిప్రియ వశిష్టకు కోలీవుడ్ స్టార్, సినీ ప్రియులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను నెట్టింట లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కానట్లు సమాచారం అందుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు