Teja: స్టార్స్ ను అధిగమించిన సూపర్ హీరో

Teja

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపిస్తూ ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ సజ్జా. తేజ సజ్జా కొన్ని సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. తేజ రీసెంట్ గా నటించిన సినిమా హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా సమస్యలను ఎదుర్కొంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ సినిమాకి సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. సంక్రాంతి సీజన్ కావటం, దానికి తోడు పెద్దపెద్ద హీరోల సినిమాలన్నీ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ సిద్ధంగా ఉండటం. ఈ సినిమాకి కొంత మేరకు మైనస్ అయింది.

సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకటం తో, ఈ సినిమాకి కేవలం ఐదు నుంచి ఆరు మాత్రమే సింగిల్ స్కిన్ థియేటర్స్ దొరికాయి. ఇకపోతే గుంటూరు కారం సినిమా మొదటి షో నుంచి కొంచెం మిశ్రమ స్పందనను అందుకుంది. అంచేత సినిమాకి కొంచెం ఆదరణ తగ్గుతూ వచ్చింది. చాలా థియేటర్స్ లో గుంటూరు కారం సినిమాని తీసేయడంతో హనుమాన్ కి ఆ థియేటర్లు దక్కాయి.

సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగ, సైంధవ్ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. ప్రస్తుతం హనుమాన్ సినిమా హవా నడుస్తుంది. ప్రేక్షకులు హనుమాన్ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. థియేటర్లలో ఈ సినిమాని చూస్తూ చాలామంది పిల్లలు ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా చాలా రికార్డులను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్గా నిలిచింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ స్థాయిలో హిట్ అయిన సినిమా ఇప్పటివరకు సంక్రాంతికి రాలేదు.

- Advertisement -

అలానే సంక్రాంతికి రిలీజైన స్టార్ హీరోల సినిమాల రికార్డ్స్ చాలా వాటిని హనుమాన్ సినిమా క్రాస్ చేసింది. అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలను దాటి ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. మామూలు సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇన్ని రికార్డులు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. ఏదేమైనా చాలా డేర్ తో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసిన ఈ సినిమా, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విజయవంతంగా కొనసాగుతుంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు