Guntur Kaaram: మరోసారి అడ్డంగా దొరికిపోయిన తమన్

Guntur Kaaram:  కొంతకాలంగా తమన్ టైం ఏంటో ఆయనకే అర్థమవుతుందో లేదో పాపం. రీసెంట్ గా ఆయన ఏ సినిమాకు పని చేసినా, తమన్ ఇచ్చే మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూనే ఉంది. మరి అలా అనిపిస్తే ఊరికే ఉంటారా నెటిజన్లు? ఏదోలాగా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వెతికి మరీ ఆ పాటను ఎక్కడి నుంచి కాపీ చేశారు అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టి ఉతికి ఆరేస్తారు. తాజాగా “గుంటూరు కారం”లోని ఊర మాస్ సాంగ్ “కుర్చీ మడత పెట్టి” సాంగ్ విషయంలో కూడా మరోసారి అడ్డంగా దొరికిపోయాడు తమన్. ఆయన ఈ పాటను ఎక్కడెక్కడ కాపీ కొట్టాడు అనే విషయాలను వీడియోలతో కంపేర్ చేసి మరి తమన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇంతకీ తమన్ ఈ పాటను ఎక్కడ కాపీ కొట్టాడు ? అనే వివరాల్లోకి వెళితే…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి మహేష్ బాబు తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న “గుంటూరు కారం” థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే “గుంటూరు కారం” మూవీకి సంబంధించిన ప్రమోషన్లను స్టార్ట్ చేసేసారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా న్యూ ఇయర్ గిఫ్ట్ గా “కుర్చీ మడత పెట్టి” అని ఊర మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

అంతకంటే ముందు విడుదల చేసిన ప్రోమో వివాదాస్పదమైంది. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందోనని ఆతృతతో ఎదురు చూసిన వారికి తమన్ గట్టిగానే షాక్ ఇచ్చాడు. సాంగ్ రిలీజ్ కాగానే ఎవరికీ పెద్దగా పెట్టలేదు గానీ, కొంత సమయం తర్వాత “కుర్చీ మడత పెట్టి” సాంగ్… ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన “జామ చెట్టు కాస్తాయి జామకాయలు” సాంగ్ మ్యూజిక్, “అత్తారింటికి దారేది” మూవీలో పవన్ కళ్యాణ్ పాడిన “కాటమరాయుడా” స్టైల్ ను మిక్స్ చేసి కలిపి కొట్టేశాడు. ఒకసారి క్లియర్ గా గమనిస్తే ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది.

- Advertisement -

మరి తమన్ ఇంత దారుణంగా ఎలా కాపీ కొట్టాడు? ఇప్పటికే సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే ఎన్నోసార్లు ఇలా కాపీ కొట్టి దొరికిపోయి ట్రోలింగ్ బాధితుడిగా ఉన్నాడు. అలాంటప్పుడు మరోసారి కాపీ కొట్టిన అడ్డంగా దొరికిపోవడం ఆయనకే చెల్లింది. ఇక అంతేకాకుండా సాంగ్ స్టార్టింగ్ లో వచ్చే ఓ చిన్న మ్యూజిక్ బిట్ ఆల్రెడీ యూట్యూబ్ లో పాపులర్ కాగా, ఓ డీజే కి డబ్బులు ఇచ్చి మరీ తన మ్యూజిక్ ని వాడుకున్నాడని అంటున్నారు.

ఇలా ఈ సాంగ్ లో ఉన్న చిన్న బిట్టుతో సహా అంతా కాపీనే. అసలే లిరిక్స్ లో ఆ బూతు పదాలు ఏంటి అంటూ జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటే, ఇలా కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోవడంతో తమన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఇలాంటి లిరిక్స్ తో, పైగా కాపీ సాంగ్ ను గుర్తించలేకపోయాడా? లేదంటే ప్రేక్షకులకు ఏం తెలుస్తుందిలే అని ఊరికే ఉండిపోయాడా? ఈ నెగిటివ్ ఎఫెక్ట్ సినిమాపై ఎలా ఉంటుందో మరి

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు