God Father : మెగాస్టార్ మూవీ నుండి లీక్

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “గాడ్ ఫాదర్”మలయాళం లో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” కు రీమేక్ ఈ చిత్రం. అప్పుడెప్పుడో తెలుగులో హనుమాన్ జంక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న 153 వ చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఓ జర్నలిస్టు పాత్రలో పూరి జగన్నాథ్ కనిపిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని రంగరించి తీస్తున్న సినిమా గాడ్ ఫాదర్.

అయితే ప్రస్తుతం గాడ్ ఫాదర్ సెట్స్ నుంచి ఓ క్రేజీ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ ఫోటోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ల పై తెరకెక్కిస్తున్న యాక్షన్ సీన్ కి సంబంధించినదని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి పక్కన సల్మాన్ ఖాన్ గన్ పట్టుకొని ఉన్నారు. గాడ్ ఫాదర్ లో ఇది క్లైమాక్స్ పోర్షన్ అనిపిస్తుంది. సల్లు భాయ్, మెగాస్టార్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో చాలా అగ్రేసివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఓ ప్రత్యేక వీడియో మెగా అభిమానులను ఉర్రూతలూగించింది.కాగా ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు