Dil Raju : ఆ వార్తలు పుకార్లే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి తాజా గా వస్తున్న చిత్రం RC15 (వర్కింగ్ టైటిల్). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ సినిమా విషయంలో మూవీ యూనిట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎలాంటి వార్తలు కూడా బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కనీసం ఇప్పటి వరకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేయలేరు. దీంతో ఈ సినిమా కు సంబంధించి రూమర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.

RC15లో కోలీవుడ్ కు సంబంధించిన నటీ నటులు నటిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అలాగే కొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని, దానిలో ఒకటి ఫిక్స్ చేశారని రూమర్స్ వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండజ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తల ఇప్పటి వరకు నిర్మాతలు స్పందించలేదు. తాజా గా దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేసి స్పందించింది.

సోషల్ మీడియాలో RC15కు సంబంధించి వస్తున్న వార్తలకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. తమ RC15 ప్రాజెక్ట్ లో నటీనటులను ఎంపిక చేసే అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదు అని చెప్పింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని లేఖలో వివరించింది. ఈ లేఖతో సోషల్ మీడియాలో RC15కి సంబంధించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు