విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ క్రేజీ మల్టీస్టారర్ ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆట ఆడుతూ కనిపించారు. ఒక వైపు, తమన్నా, మెహ్రీన్ సోనాల్ చౌహాన్ తాడును లాగుతుండగా మరోవైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్ లో వరుణ్ ని ప్రోత్సహించడం ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూల్‌గా కనిపిస్తుండగా, తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్‌గా కనిపిస్తున్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత : శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డివోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్
ఎడిటర్ : తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్