Sita Ramam : ఫుల్ క్లారిటీ

ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సీతారామం చిత్రం గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. సాధార‌ణంగా ఓటీటీల స‌మ‌యంలో సినిమా విడుద‌లైందా.? థియేట‌ర్‌లో ఆడిందా..? వారం, రెండు వారాల‌కే థియేట‌ర్ నుంచి బాక్సులు బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాయి. ఇక సీతారామం విష‌యంలో మాత్రం ఇందుకు భిన్నంగా జ‌రిగింద‌నే చెప్పాలి.

ఓ వైపు సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు ప‌లు చోట్ల ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటో ఇట్టే అర్థం అవుతోంది.ప్ర‌స్తుతం విడుద‌లైన చిత్రాల్లో ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించే ట్రెండ్ కొన‌సాగుతుంది. ఇక సీతారామం చిత్రం విష‌యంలో కూడా సీక్వెల్ ఉంటే బాగుంటుంద‌ని చాలా మంది అనుకుంటున్నారు. ఈ చిత్రం స‌క్సెస్ మీట్‌లో ఓ జ‌ర్న‌లిస్ట్ ఇదే ప్ర‌శ్న‌ను దుల్క‌ర్ స‌ల్మాన్‌ని అడిగారు.

నేను న‌టుడిని కాక‌ముందు ఒక విష‌యాన్ని తెలుసుకున్నాను. అది ఏంటంటే ఏదైనా సినిమాకి విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించి, క్లాసిక్‌గా నిలిచితే దానిని మ‌ళ్లీ ట‌చ్ చేయ‌కూడ‌దు అని, మేము ఈ క‌థ‌ను బాగా న‌మ్మాం. అందుకే సీతారామం సినిమా క్లాసిక్‌గా నిలుస్తుంద‌ని భావించాం. అనుకున్న‌ట్టుగానే ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. దాదాపు ఈ సినిమా సీక్వెల్ ఉండ‌దు అని నేను అనుకుంటున్న‌ట్టు దుల్క‌ర్ స‌ల్మాన్ పేర్కొన‌డం విశేషం. మొత్తానికి సీతారామం సీక్వెల్ విష‌యంపై సందేహాలు ఉన్న వారికి దుల్క‌ర్ చెప్పిన స‌మాధానంతో తేట‌తెల్ల‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు